సుధీర్ కెరీర్ విషయంలో మరింత సక్సెస్ కావాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఆలస్యంగానైనా సక్సెస్ ను సొంతం చేసుకోవచ్చని చెప్పడానికి సుధీర్ ఉదాహరణ అని చెప్పవచ్చు. హీరోగా సుధీర్ నటించే సినిమాలు హిట్ అయితే భవిష్యత్తులో సుధీర్ మూవీ ఆఫర్లతో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే బుల్లితెరపై కమెడియన్ గా, బుల్లితెర మెగాస్టార్ గా భారీ పాపులారిటీ అందుకున్న సుదీర్ ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటడానికి పయనమయ్యాడు.
అలా మొదట సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా మారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత గాలోడు సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించిన సుధీర్ కు ఈసారి పక్కా హిట్టు లభించిందని చెప్పాలి. ఇప్పుడు GOAT సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు బుల్లితెర మరొకవైపు వెండితెర అంటూ రెండు చేతుల బాగానే సంపాదిస్తున్న సుదీర్ ఇప్పటివరకు ఎంత ఆస్తి కూడబెట్టారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ .3 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న సుధీర్ మొత్తంగా రూ .25 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాదులో ఒక విలాసవంతమైన ఇంటితోపాటు రెండు బైకులు, ఒక ఖరీదైన కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తన సంపాదనతో పొలాలు కూడా కొన్నారట. మొత్తానికి అయితే సుధీర్ భారీగానే సంపాదించాడని చెప్పవచ్చు.