ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నప్పటికి శివాత్మిక రాజశేఖర్, శివానీ రాజశేఖర్‌కు సరైన బ్రేక్ రావడం లేదు. శివాత్మిక లేటెస్ట్ పిక్స్ చూసి డస్కీ బ్యూటీ, చాక్లెట్ బ్యూటీ అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. మరో నెటిజన్ నీ ఫేస్‌లో ఏదో మాగ్నెట్ ఉంది..ఎంత సేవు చూసినా అలాగే చూడాలని పిస్తోందని కామెంట్ పెట్టాడు. అయితే రాజశేఖర్ వారసురాలిగా కూతురు శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
తెలుగులో పలు సినిమాలు చేసిన శివాత్మిక.. తమిళంలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. చేసిన సినిమాలు నాలుగే అయినా గాని.. శివాత్మికకి సెపరేట్ ఇమేజ్ పాపులారిటీ దక్కించుకుంది. చాలా న్యాచురల్ బ్యూటీతో స్క్రీన్ ప్రజెన్స్ ఉంటాది. మేకప్ లేకుండానే చాలా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను నెటిజన్లను ఆకట్టుకుంటుంది.




ఇదెలా ఉంటే నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పింక్ కలర్ శారీలో..స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది. పైట కొంగు పక్కకు జరిపి మరి.. నడుము చూపిస్తూ ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే రంగమార్తాండ చిత్రంలో నటించిన శివత్మిక.. తన నటనతో అద్భుతమైన స్పందన దక్కించుకుంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతోంది.