హీరోయిన్ లు గ్లామర్ రోల్స్ చేస్తే విజయ శాంతి మాత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనను తానే హీరో రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీ లో ఎదిగి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది.
వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్, ఏయెన్నార్ ల కలయికలో వచ్చిన ‘సత్యం – శివం’లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తు పెట్టుకోదగ్గది.ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది.విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన నేటి భారతం.అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండాపోయింది. క్రమంగా కథానాయికగా ఒక్కో మెట్టే అధిరోహిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరింది.
అయితే చాలా మంది నటీనటుల ఫామిలీ ఫోటోల గురించి మనకి తెలుస్తూనే ఉంటుంది. ఎవరిని పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఎవరు అని.కానీ ఒకప్పుడు టాప్ హీరోయిన్ అయిన “విజయశాంతి” గారికి పెళ్లి అయిన సంగతి కూడా మనలో చాలా మందికి తెలియదు.సినిమాల్లో చేస్తున్నప్పుడే ఎప్పటినుండో పరిచయం ఉన్న”శ్రీనివాస్ ప్రసాద్” ను పెళ్లి చేసుకుంది. ఎటువంటి హంగామా లేకుండా పెళ్లి సింపుల్ గా జరిగిందట.ఆమె రాజకీయాల్లోకి రావడం వెనక కూడా ఆయన ప్రోత్సాహం ఉందట!