డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు..కాస్త టాలెంట్, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు..డబ్బు దానంతట అదే వస్తుంది. యూట్యూబ్ పుణ్యమా అని కొందరు తమ టాలెంట్, క్రియేటివిటీతో రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే క్రియేటివిటీ ఉండి, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం ఉండాలేగానీ యూ ట్యూబ్ లో ఊహించని డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది వీటిని నిజం చేసి చూపిస్తున్నారు కూడా. అలాంటి కొంతమంది వ్యక్తుల్లో ఒకరు శ్రావణి సామంతపూడి.
అయితే ఆమె 2022 జనవరి నెలలో ‘‘బ్యాంకాక్ పిల్ల’’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను మొదలు పెట్టారు. తక్కువ కాలంలోనే దాదాపు 20 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ను పొందారు. సోషల్ మీడియా వ్యాప్తంగా బాగా ఫేమస్ అయిపోయారు. ఆమె వీడియోలకు లక్షలు, మిలియన్లలో వ్యూస్ వస్తూ ఉన్నాయి. గతంలో ఆమె తన మొదటి నెల యూట్యూబ్ సంపాదన గురించి ఓ వీడియో చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే రెండో నెల యూట్యూబ్ సంపాదన గురించిన కూడా చెప్పమని ఆమె అభిమానులు కోరారు.
దీంతో ఆమె తన రెండో నెల యూట్యూబ్ సంపాదన గురించి కూడా ఓ ప్రత్యేకమైన వీడియో చేసింది. ఆ వీడియోలో తన సంపాదన గురించిన పూర్తి వివరాలు వెల్లడించింది. ఆమె రెండో నెలకు గానూ దాదాపు 2 వేలకు పైగా డాలర్లను సంపాదించింది. దీన్ని ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే.. రూ. 2 లక్షలకుపైగా అవుతుంది. ఆమె వ్లాగ్స్ చేస్తూ నెలకు 2 లక్షల రూపాయలకు పైగా సంపాదించటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించగలమనటానికి బ్యాంకాక్ పిల్ల ఓ నిదర్శనంగా నిలుస్తోంది. మరి, బ్యాంకాక్ పిల్ల రెండో నెల సంపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.