మన దేశంలో కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా వితంతువుల విషయంలో.. భర్త చనిపోయిన స్ట్రీలు మళ్లీ పెళ్లి చేసుకోకూడదన్న ఆచారం ఎప్పటినుంచో ఉంది. అయితే ఇప్పుడు యువత మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమ ఒంటరి తల్లులకు మళ్లీ పెళ్లి చేసి వారికొక కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ఇటీవల కొందరు యువకులు స్వయంగా వరుడిని చూసి తమ ఒంటరి తల్లులకు పెళ్లిళ్లు చేసిన సంఘటనలు చాలానే చూశాం.
అయితే తాజాగా మరాఠీ నటుడు సిద్దార్థ్ ఛందేకర్.. తన తల్లికి రెండో పెళ్లి చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సిటీ ఆఫ్ డ్రీమ్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దార్థ్.. తన తల్లి సీమా ఛందేకర్ కు వివాహం జరిపించాడు. ఆమె పెళ్లి ఫోటోలను అభిమనులతో షేర్ చేస్తూ.. తన జీవితంలో ఇదే బెస్ట్ వెడ్డింగ్ అంటూ రాసుకొచ్చాడు.’హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్ అమ్మా.. నీ పిల్లలతో పాటు.. నీక్కూడా మంచి భవిష్యత్ ఉంది. నీకు అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు నువ్వు నీ బిడ్డల కోసం చాలా త్యాగం చేశావు.

ఇక ఇప్పుడు నీ గురించి, నీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ విషయంలో నీకు మేమెప్పుడూ సపోర్ట్ గా ఉంటాము. నా పెళ్లి నువ్వెంత గ్రాండ్ గా చేశావో .. ఇప్పుడు నీ పెళ్లి నేను అంతే గ్రాండ్ గా చేశాను. నా జీవితంలో నేను ఎక్కువగా ఇష్టపడిన పెళ్లి అంటే ఇదే.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోస్ చూసిన అభిమానులు.. మంచి పని చేసావ్ సిద్దార్థ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.