వ్యాయామాలు అధికంగా చేసినా, పనులు శారీరక శ్రమ అధికంగా ఉన్నా కండరాల నొప్పులు వస్తాయి. ఐస్ బాత్ చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే అలసట, నీరసం, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఐస్ బాత్ చేస్తూ ఉండాలి. ఇది ఆ సమస్యలను తగ్గించేందుకు పనిచేస్తుంది. అయితే సమంత, ప్రజ్ఞా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఐస్ బాత్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఆ వీడియోలను, ఫోటోలను తమ ఇన్ స్టా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు.
గడ్డకట్టే చలిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఐస్ నీళ్లతో స్నానం చేయడమే ఐస్ బాత్. కొన్ని నిమిషాల పాటు ఆ ఐస్ నీళ్లలో అలా కూర్చొని బయటికి వచ్చేస్తే చాలు, ఐస్ బాత్ పూర్తయినట్టే. ఇలా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని కాసేపు సేద తీరేలా చేయడం ఈ ఐస్ బాత్ ప్రక్రియ. బాలీవుడ్ హీరో హీరోయిన్లు, టాలీవుడ్ సెలెబ్రిటీలు, క్రీడాకారులు… ఇలా ఎంతోమంది ఐస్ బాత్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. సమంత బాలి ట్రిప్ లో మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో 6 నిమిషాల పాటు ఐస్ బాత్ చేసింది.
ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి చేస్తే శరీరానికి ఎంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది. సాధారణంగా చల్లని నీటితో స్నానం చేయడమే కొంచెం కష్టం. ఇప్పుడు అందరూ గోరువెచ్చని నీళ్లు, వేడినీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాంటిది మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటితో నిమిషాల పాటు ఉండడం అంటే చాలా కష్టం. గడ్డకట్టుకుపోయినట్టు అవుతుంది. అయితే ఈ ఐస్ బాత్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఈ పద్ధతిని పాటిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. వ్యాయామాలు అధికంగా చేసినా, పనులు శారీరక శ్రమ అధికంగా ఉన్నా కండరాల నొప్పులు వస్తాయి.
ఐస్ బాత్ చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. కండరాలకు సాంత్వన ఇస్తుంది. అలాగే అలసట, నీరసం, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఐస్ బాత్ చేస్తూ ఉండాలి. ఇది ఆ సమస్యలను తగ్గించేందుకు పనిచేస్తుంది. మన కేంద్ర నాడీ వ్యవస్థ ఉత్తేజితమయ్యేలా చేస్తుంది.