మెగా అభిమానులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతరు.

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయాన్ని అందుకున్నారు. అయితే మెగా డాటర్స్ మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయారు. మెగా డాటర్ నిహారిక కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అయితే భోళా శంకర్ సినిమా మాత్రం మెగాస్టార్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆశించిన మేర రిజల్ట్ రాబట్టలేదు. తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది.

ఈ మధ్యకాలంలో ఏ హీరోకు కూడా ఎదురుకాని చేదు అనుభవం ఈ భోళా శంకర్ కి ఎదురైంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆయన పెద్ద కూతురు సుస్మిత. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్ గా వర్క్ చేతిశున్న సుస్మిత. రీసెంట్ గానే గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యానర్‌పై ఏకంగా చిరంజీవితో సినిమా నిర్మించబోతోంది మెగాస్టార్ డాటర్. ఈ విషయాన్ని చిరు పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా వెల్లడించింది.

మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ ఈ సినిమా రూపొందనుందని సుస్మిత పేర్కొంది. ఈ మేరకు చిరంజీవికి ప్రత్యేకంగా బర్త్ డే విష్ చేస్తూ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. అయితే తాను నిర్మించబోతున్న ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టింది సుస్మిత. ఇప్పటికే గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాను నిర్మించింది సుస్మిత. అయితే ఈ సారి బిగ్ ప్రాజెక్ట్ ఆమెతో చేయించేలా రంగంలోకి దిగారట మెగాస్టార్. ఈ మేరకు తాను చేయబోతున్న కొత్త సినిమా నిర్మాణ బాధ్యతలు సుష్మిత చేతిలో పెట్టారట చిరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *