ఇటీవల కూడా యువతిపై ఓ పోకిరి అలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేయగా వారు ఆ పోకిరి గాడికి ఆమెతోనే దేహశుద్ధి చేయించారు. అయితే నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు.. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతి. ఇంతలోనే వెనక నుంచి వచ్చిన ఓ పోకిరి. మాములుగానే చుట్టూ జనాలున్న కూడా వేధింపులకు పాల్పడుతున్న ఈ రోజుల్లో.. అలాంటిది ఒంటరిగా అమ్మాయి దొరికితే ఇంకేమైనా ఉందా?
అమ్మాయిని నడిరోడ్డుపై వేధించడం మొదలెట్టాడు ఆ యువకుడు. అంతలోనే అటువైపుగా ఓ బస్సు వచ్చింది. అందులో ఉన్న కొందరు యువతిని కుర్రాడు వేధిస్తుంది గమనించారు. వెంటనే బస్సును ఆపి.. కిందకు దిగి వచ్చిన ఓ నలుగురు యువకులు ఆ పోకిరికి తగిన బుద్ది చెప్పారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ, దీని తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సీసీటీవీ ఇడియట్స్ (@cctvidiots) అనే ట్విటర్ ఖాతా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘నడిరోడ్డుపై అమ్మాయిపై వేధింపులు’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 38 సెకండ్ల నిడివి కలిగిన ఈ ఈ వీడియోకు ఇప్పటివరకు 13.7మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
For harrassing a girl on road pic.twitter.com/TBJmwRVHAc
— CCTV IDIOTS (@cctvidiots) April 9, 2023