సమంత నటించిన ఖుషి సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ వరకు కూడా ఉండకుండా రెండు రోజుల క్రితం తన తల్లితో కలిసి సమంత అమెరికా వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించిన సామ్ ఇప్పుడు న్యూయార్క్ లో చక్కర్లు కొడుతుంది. అయితే సమంత తన జిమ్ ట్రైనర్, తన పెట్స్‌తో ఉన్న ఫోటోలను మాత్రం నిత్యం షేర్ చేస్తూనే ఉంది. జిమ్‌లో సమంత బాగానే కష్టపడుతోంది.
తాజాగా సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన పెట్స్, తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నామనేది, ఎలా చిల్ అవుతున్నామనేది చూపించింది. ఇందులోని ఓ ఫోటో మీద ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. సమంత మొహం వంకర పెట్టడంతో ట్రోల్ చేస్తున్నారు. ఆ మొహం ఏంటి అలా తిరిగిపోయింది.. వంకరపోయింది.. పక్షవాతం వచ్చిందా? అంటూ ఇలా నానా రకాలుగా ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు.
సమంతకు బాగా లేదని, రెస్ట్ తీసుకుంటోందని, అందుకే ఈవెంట్‌కు రాలేకపోయిందని ఖుషి ట్రైలర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. సమంత రాకపోయి ఉంటే.. ఇంకో పదేళ్లు అయినా కూడా సినిమా షూటింగ్‌ను ఆపేసేవాళ్లమని విజయ్ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సమంత ఖుషి సినిమాతో కమ్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి. అసలే ఖుషి సినిమాతో ముగ్గురి జీవితం ముడి పడింది. శివ నిర్వాణ, విజయ్, సమంతలను ఫ్లాపుల్లోంచి బయటపడేసే చిత్రంగా ఖుషి రానుందని అంతా అనుకుంటున్నారు. మరి సెప్టెంబర్ 1న ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.