శోభన..1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. ఆమె చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీలో శిక్షణ పొందినది. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. అయితే అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే శోభన మలయాళం అమ్మాయి. నాట్య రంగంలో ఆరితేరిన ఆమె ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. కళలపై ఆసక్తి ఉన్న శోభన 1984లో ‘శ్రీమతి కానుక’ అనే తెలుగు సినిమాలో సుమన్ తో కలిసి మొదటిసారి నటించింది.
ఆ తరువాత నాగార్జునతో కలిసి ‘విక్రమ్’ అనే సినిమాలో కనిపించింది. అక్కినేని నాగార్జున కు ఇది డెబ్యూ మూవీ. ఆ తరువాత వరుసగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించిన శోభన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మోహన్ బాబుతో కలిసి ‘గేమ్’ సినిమాలో కనిపించింది. తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించిన శోభన పర్సనల్ లైఫ్ మాత్రం అందరిలా లేదు. ఆమెకు 50 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అందుకు పెద్ద కారణమే ఉంది. సినిమాల్లో నటిస్తున్న కాలంలో శోభన మలయాళం పరిశ్రమకు చెందిన ఓ హీరోను ప్రేమించింది.
అయితే ఆయన మోసం చేయడంతో ప్రేమపై శోభనకు అపనమ్మకం ఏర్పడింది. దీంతో ఇక జీవితంలో ఎవరిని ప్రేమించకూడదు అని నిర్ణయించింది. క్రమంగా ఎవరిపై ఆమెకు నమ్మకం కూడా కలగకపోవడంతో పెళ్లి చేసుకోలేదు. చిన్నప్పుడే నాట్యరంగంలో కళాకారిణి అయిన శోభన ఇప్పటికీ అదే కళను నమ్ముకొని జీవిస్తుంది. కొందరికి నాట్యం నేర్పుతూ హాయిగా జీవిస్తోంది. అయితే తనకంటూ ఒకరు తోడు ఉండాలనే ఉద్దేశంతో ఓ పాపను దత్తత తీసుకొని ఆమె బాగోగులు చూసుకుంటోంది. అయితే పెళ్లి గురించి తన వద్ద ప్రస్తావించినప్పుడు శోభన చికాకు పడుతుంది. అసలు ప్రేమ అనేది టైం వేస్ట్ అంటూ చెబుతోంది. ప్రస్తుతం శోభన గుర్తుపట్టకుండా మారిపోయింది.