మహేష్ బాబు ఇంట్లో ఓ విషాదం, ఎమోషనల్‌ అయిన సితార.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని అప్పుడే సెలబ్రిటీ హోదా పొందారు. ఆమెకు ఉన్న ఫేమ్ రీత్యా వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు. ఆ మధ్య జీ తెలుగు మహేష్ బాబు, సితారతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఛానల్ లో ప్రారంభం కానున్న కొత్త సీరియల్స్ ప్రమోషనల్ యాడ్స్ లో నటించారు. అయితే ఘట్టమనేని మహేష్ బాబు ఇంట్లో ఓ విషాదం చోటుచేసుకుంది. వారు గత ఏడేళ్లుగా పెంచుకుంటున్న పెట్ డాగ్ చనిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న ప్లూటో (పెట్ డాగ్) మృతి చెందడంతో నమ్రత శిరోద్కర్, కూతురు సితార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

మహేష్ బాబు కూతురు సితార మనసు ఆకాశం అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంది.రీసెంట్ గా తన బర్త్ డే స్పెషల్ గా తన తండ్రి మహేష్ ఫౌండేషన్ లోని అమ్మాయిలతో సరదాగా గడిపి వారికి సైకిల్స్ ను అందించింది. అలాగే ఓ జ్యూవెలరీ యాడ్ కోసం దాదాపు రూ. కోటి రెమ్యూనరేషన్ అందుకుని, అమౌంట్ మొత్తాన్ని సితార ఛారిటీ కి ఇవ్వడం విశేషం.ఇవాళ (ఆగస్ట్ 17న) మహేష్ బాబు ఇంట్లో గత ఏడేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకున్నపెట్ డాగ్(ప్లూటో) చనిపోయింది. సితార ఎప్పుడు ప్లూటోతో ఎంతో చక్కగా ఆడుకుంటుందని సమాచారం.

ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న ప్లూటో మృతి చెందడంతో నమ్రత శిరోద్కర్, కూతురు సితార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు సితార తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చేసిన ‘ఏడేళ్ల బంధం.. మిస్ యూ ప్లూటో’’ అంటూ షేర్ చేయగా.. దానికి స్పందించిన నమ్రత.. ‘‘ప్లూటో ఎక్కడికి వెళ్లదు.. మనతోనే, మన ప్రార్థనలో ఎప్పటికీ మనతోనే ఉంటుంది’’ అంటూ సితారకు ధైర్యం చెప్పింది. అంతే కాకుండా.. ఘట్టమనేని అభిమానులు సైతం ఆ పోస్ట్‌కు రిప్లైలు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *