యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి 2008లో కంత్రి అనే సినిమా చేశారు. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమా తెరకెక్కించాడు మెహర్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ కెరీర్ లో స్టైలిష్ మూవీగా నిలిచింది బిల్లా. ఆతర్వాత 2011లో ఎన్టీఆర్ తో కలిసి శక్తి అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 2013లో వెంకటేష్ తో కలిసి షాడో అనే సినిమా చేశారు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో మెహర్ రమేష్ ను ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పాలి.
ఆయనపై నెగటివ్ కామెంట్స్ చేసి ట్రోల్స్ కూడా చేస్తున్నారు ముఖ్యంగా కన్నడ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా అక్కడ భారీ విజయం సొంతం చేసుకోవడంతో వెంటనే మరొకసారి పునీత్ రాజకుమార్ తో కలిసి అజయ్ అనే సినిమాకి కూడా మెహర్ రమేష్ దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా మహేష్ బాబు ఒక్కడు సినిమాకి రీమేక్ గా తీశారు. ఇక ఈ సినిమా కూడా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మెహర్ రమేష్ సినిమాలు చేయడం జరిగింది.

ఒక 2013లో వెంకటేష్ తో షాడో సినిమా తీయగా అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత భోళాశంకర్ సినిమా చేసిన అది కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇలా దాదాపు ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు అట్టర్ ప్లాప్ గానే నిలిచాయి. ఇదిలా ఉండగా మెహర్ రమేష్ కూడా ఒక సినిమాలో నటించారు.. ఆయన నటించిన సినిమా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మహేష్ బాబు హీరోగా నటించిన బాబి సినిమాలో మెహర్ రమేష్.. మహేష్ బాబు స్నేహితుడి క్యారెక్టర్ లో కనిపించారు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.