త్వరలో రూ.500 నోట్ల రద్దు..? ఎన్నికల ముందు మోడీ సంచలన నిర్ణయం.

ప్రస్తుతం రూ.2 వేల నోట్లు బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ అవుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పటికే రూ.17 వేల కోట్లు వచ్చినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇప్పటి వరకు పెద్ద నోట్లను దాచుకున్న వారు వాటిని మార్చుకుని రూ.500 నోట్లను తీసుకుంటున్నారు. ఇప్పుడు వాటిని దాచేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రోజూ వేల కోట్ల రూ.500 నోట్లు మాయమవుతున్నాయి. అయితే ఎప్పుడైతే.. రూ.2000 నోట్లను RBI ఉపసంహరించుకుందో… అప్పుడు ఆ నోట్లను అక్రమంగా దాచుకున్న వారు.. ఇప్పుడు వాటిని మార్చుకొని… రూ.500 నోట్లను తీసుకుంటున్నారు. వాటిని దాచేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రోజూ వేల కోట్ల రూపాయల రూ.500 నోట్లు మాయమవుతున్నాయి.

నకిలీ నోట్లు.. ఇది మరో యాంగిల్. ఎప్పుడైతే రూ.2000 నోటును RBI ఉపసంహరించిందో… వెంటనే రూ.500 నోట్లకు డిమాండ్.. 4 రెట్లు పెరిగింది. దాంతో.. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని.. నకిలీ నోట్ల మాయగాళ్లు రెడీ అయిపోయారు. ఇష్టమొచ్చినట్లు రూ.500 నోట్లను నకిలీవి ముద్రిస్తూ… దేశవ్యాప్తంగా మార్పిడి చేస్తున్నారు. అందువల్ల ఇండియాలో రూ.500 నోట్లలో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలియని పరిస్థితి వచ్చేసింది. ఈ నకిలీ నోట్లను పాకిస్థాన్‌లో ముద్రిస్తున్నారు.

వాటిని నేపాల్, బంగ్లాదేశ్ వైపు నుంచి ఇండియాలోకి తరలిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన నోట్ల కంటే… 20 శాతం ఎక్కువగా రూ.500 నోట్లు చెలామణీలో ఉన్నాయి. ఆ ఎక్కువగా ఉన్నవన్నీ నకిలీ నోట్లే. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల నమ్మకం సడలిపోతుంది. అందుకే రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోటును కూడా ఉపసంహరించుకుంటుంది అనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా… ఆర్థిక నిపుణుల్లో చాలా మంది రద్దు చేసేయడమే బెటర్ అంటున్నారు. ఈ పెద్ద నోట్ల వల్ల నల్లధనం పోగవుతోందనీ.. మనీ సర్క్యులేషన్ పెద్దగా జరగట్లేదని అంటున్నారు. వీటిని రద్దు చేసేస్తే.. నల్లధనాన్ని గుర్తించడం చాలా తేలిక అవుతుంది అంటున్నారు. మరోవైపు రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవడం ద్వారా… అవి వెనక్కి వచ్చేస్తాయని RBI భావించింది. కానీ… ఇప్పటివరకూ 20 శాతం నోట్లు మాత్రమే బ్యాంకులకు చేరాయి. మిగతా నోట్లను ప్రజలు బ్యాంకుల్లో ఇవ్వకుండా చెలామణీ చేస్తున్నారు. పెట్రోల్ బంకులు, షాపింగ్ మాళ్లలో ఇస్తున్నారు. అందువల్ల చాలా నోట్లు బ్యాంకులకు రావడానికి టైమ్ పట్టేలా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *