2024లో ఆ స్టార్ హీరో, స్టార్ యాంకర్ చనిపోతారా..? వేణు స్వామి ఏం చెప్పాడో చుడండి.

ట్రోలింగ్‌పై స్పందించిన వేణుస్వామి.. నెటిజన్లకు ఓ క్లారిటీ ఇచ్చారు. “సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తూ నేను చెప్పినట్టుగా చెబుతున్న వీడియో ఇది… ఒరిజినల్ వీడియో.. యాంకర్ తెలంగాణలో టీఆర్ఎస్ వస్తే ఎవరు ముఖ్యమంత్రి అన్న ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని కట్ చేసి ఆ వీడియోను ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ అందరికీ నా శుభాకాంక్షలు నా మంగళాకాంక్షలు.” అంటూ తన అఫీషియల్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ కథానాయకుడి ఆరోగ్యం బాగోలేదని, విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నాడని వేణుస్వామి చెబుతున్నాడు.

అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, మరణించనున్నాడంటూ చెప్పాడు. సోషల్ మీడియాలో ఆ హీరో అతనే అంటూ ఎవరికి తోచిన పేరును వారు ట్రెండ్ చేస్తున్నారు. మా హీరో చక్కగా ఉన్నాడని, ఆరోగ్యం చాలా బాగుందని, నోరుంది కదా అని నోటికొచ్చింది వాగేస్తారా? వాడెవడో చెప్పడం.. మీరు వాగడం.. వెళ్లి మీ పనులు చూసుకోండి అంటూ హీరోల అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం వేణుస్వామి పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.

జ్యోతిష్యాన్ని పట్టించుకోవద్దని, వారు చెప్పినవన్నీ వింటూ వెళితే జీవితంలో ముందుకు వెళ్లలేమని హీరోల అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఒక్కరూ హీరోలు, హీరోయిన్ల జాతకాలు చెబుతూ సెలబ్రిటీలా మారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని, గొప్పవారు కావాలి అంటే గొప్ప గొప్ప పనులు చేయాలి కానీ గొప్పవారిపై వ్యాఖ్యలు చేయకూడదని హితవు చెబుతున్నారు. జాతకాలు చెప్పేవారంతా ముందుగా తమ జాతకాలను బాగా పరిశీలించుకోవాలంటున్నారు. నోటికొచ్చినట్లు వాళ్లు వాగడం.. ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం ఫ్యాషన్ అయిపోయిందంటూ మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *