టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరంటే.. ఇద్దరి పేర్లు టక్కున్ చెప్పేస్తారు. అవి యంగ్ రెంబల్ స్టార్ ప్రభాస్, అరుంధతి బ్యూటీ అనుష్క. వీళ్లిద్దరు నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అఫ్ కోర్స్.. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. వీలు చూసుకుని పెళ్ళి పీఠలెక్కుతారని టాక్ ఎప్పటి నుంనో నడుస్తుంది. అయితే ఇప్పటికే ఆమె వయసు 40 దాటేసింది. దీంతో ఆమె అసలు వివాహం చేసుకుంటుందా లేదా అని సందేహాలు మొదలయ్యాయి.
వీటికి అనుష్క స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె లేటెస్ట్ మూవీ మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన వచ్చింది. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. ఆ ఏ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అనుష్క పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతుందని చెందిన అభిమానులకు ఆమె కామెంట్స్ సంతోషపరిచాయి.
ఇక అరుంధతి ,భాగమతిలో చేసిన పాత్రలు తనకు ఎంతో ఇష్టమని, అలాగే మిస్ చెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో చేసిన పాత్ర కూడా తనకు అంత ఇష్టమని వెల్లడించారు. అదృష్టం ఉంటే కానీ ఇలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తుందని అన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటించాడు. ఇక ఈ సినిమాపై అనుష్క భారీ అంచనాలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.